Friday, February 6, 2026
E-PAPER
Homeకరీంనగర్గ్రామ సమాఖ్య భవనంతో మహిళా సాధికారతకు బాటలు

గ్రామ సమాఖ్య భవనంతో మహిళా సాధికారతకు బాటలు

- Advertisement -

సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ 
నవతెలంగాణ – వీర్నపల్లి 

మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి మరో ముందడుగు పడిందనీ సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ అన్నారు. వీర్నపల్లి గ్రామ మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ గ్రామ పాలక వర్గ ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధుల నుండి ఈ భవన నిర్మాణం కోసం రూ. 10 లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ వెల్లడించారు. మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడానికి, వారి కార్యకలాపాలను మెరుగుపరుచుకోవడానికి ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.

భవన నిర్మాణాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకువస్తామని, నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. మహిళల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. గ్రామ సమాఖ్య భవనం అందుబాటులోకి వస్తే మహిళా సంఘాలకు ఒక శాశ్వత వేదిక లభిస్తుందన్నారు . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కుల నరేష్, ఏ ఎం సి చైర్మన్ రాములు నాయక్, ఎమ్మార్వో ముక్తార్ పాషా, ఎంపిడివో శ్రీలేఖ,ఏ పి ఓ శ్రీహరి, ఏ పి ఎం దేవ రాజు, బ్యాంక్ మేనేజర్ సంతోష్,వార్డు సభ్యులు భగ వంతం, సంజీవ్, గోరెమియ, పద్మయ్య, సురేష్, లావణ్య, రోజా, నవ నీతా, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఏ ఎం సి డైరెక్టర్ చంద్ర మౌళి, బీజేపీ మాజీ అధ్యక్షులు మల్లేశం, గ్రామ పెద్దలు గడ్డం దేవయ్య, మహిళ సంఘం అధ్యక్షురాలు, సి ఏ లు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -