ఎండి జహంగీర్ సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మున్సిపాలిటీలో రానున్న ఎన్నికల్లో 4వ వార్డ్ సీపీఐ (ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్‌ను గెలిపించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆలేరు మున్సిపల్ 4వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే,ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలిచే మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్‌ను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీపీఐ (ఎం) ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండి పోరాటాలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇల్లు లేని పేదల కోసం ఇళ్ల స్థలాల పోరాటాలు నిర్వహించి వందల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో సీపీఐ (ఎం) కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. పోరాట వారసత్వం కలిగిన అభ్యర్థిని గెలిపిస్తే మున్సిపల్ పాలకవర్గంలో ప్రజల తరఫున నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిశీలించినప్పుడు ప్రజల కోసం పనిచేసే, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారినే గెలిపించుకోవాలని పలువురు ఓటర్లు ప్రచారంలో జహంగీర్ దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన జహంగీర్ గత పాలకవర్గంలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరిగిందని అన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో 11 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ,నాలుగో వార్డులో మాత్రమే సీపీఐ (ఎం) పోటీ చేస్తోందని వివరించారు.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ప్రజా పోరాటాలకు మద్దతుగా నిలిచి సీపీఐ (ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్‌ను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్,మండల కార్యదర్శి దూపటి వెంకటేష్,మొరిగాడి రమేష్,జూకంటి పౌలు,సూదగాని సత్య రాజయ్య,సంగి రాజు, నల్లమాస తులసయ్య,పిక్క గణేష్,వడ్డేమాన్ బాలరాజు,గణగాని మల్లేశం,తాళ్లపల్లి గణేష్,బొప్పిడి యాదగిరి,చెన్న రాజేష్,కాసుల నరేష్,మొరిగాడి పుష్ప,స్వరూప, చంద్రకళ,ఘణగాని భాగ్యమ్మ,అయిలి అంజమ్మ,మొరిగాడి మంజుల,అనిత,హర్షిత,యాసారపు ప్రసాద్,ఎండి మతిన్,ఎండి అఖిల్, పిఎన్ఎం కళాకారులు బిక్షపతి,శ్రీమాన్,బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




