Friday, February 6, 2026
E-PAPER
Homeజిల్లాలుసీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి

సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ – వనపర్తి 

నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 18 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి గంధం మధన్, 21వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి పుట్ట ఆంజనేయులు గెలుపు కోసం రెండు వార్డులో భారీగా ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కర్రెమ్మ గుడి దగ్గర ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి కార్మికులు కర్షకులు ఐక్యం కాకుండా విచ్ఛిన్నం చేస్తుందన్నారు. కష్టజీవులందరూ ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఆ పరిష్కారం కావాలంటే మీ వార్డులో సమస్యలు పరిష్కారం కావాలంటే పేద ప్రజల గురించి తెలిసిన కమ్యూనిస్టు నాయకులను గెలిపించే విధంగా కృషి చేయాలని వారు కోరారు.

బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల అమలు కోసం రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో చర్చించి 6 గ్యారంటీలో అమ్ములు కోసం, వార్డు సమస్యలు కృషి చేస్తానన్నారు, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి వేయించి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 21 వార్డ్ కౌన్సిలర్ పుట్ట ఆంజనేయులు, 18 వార్డు కౌన్సిలర్ గంధం మదన్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, డి బాల్ రెడ్డి, ఎం రాజు, బీఆర్ఎస్ నాయకులు గంధం బాల పేరు, గంధం విజయ్, డాక్టర్ దానేలు, విజయ్, పరంజ్యోతి, మంద రాము, డి తిరుపతయ్య, డి వెంకటయ్య, సరస్వతి, వాటి జిల్లా నాయకులు వెంకట్ రాములు, బాలయ్య నాయక్, మేకల ఆంజనేయులు, జీ వెంకటయ్య, సాయి లీల, సీపీఐ(ఎం) సర్పంచులు కవిత, నిరంజన్. సీపీఐ(ఎం) పార్టీ టౌన్ నాయకులు డి కురుమయ్య, పుల్లన్న, రాబర్ట్, గంధం బాలరాజ్, జీ రమేష్, గంధం ఘట్టన్న, సీపీఐ(ఎం) ,బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -