– ప్రతీ ఓటరు కుపోల్ స్లిప్ అందజేయాలి
– ఎన్నికల జిల్లా సహాయ అధికారి నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ నిర్వహించాలని,ప్రతీ ఓటరు కు పోల్ స్లిప్ అందజేయాలని మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి,స్థానిక మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, బీఎల్ఓ లకు జరిగిన వేర్వేరు సమావేశాల్లో సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా రైతు వేదిక లో పీఓ,ఏపీఓ లకు, మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో బీఎల్ఓ లకు శుక్రవారం అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సామాగ్రి పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ స్లిప్ తో ఓటరు భరోసా గా తన ఓటు ను వినియోగించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లు బీ.శ్రీశైలం,హెచ్.హరిబాబు లు పాల్గొన్నారు.



