Friday, February 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యా రంగానికి పెద్దపీట: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

విద్యా రంగానికి పెద్దపీట: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
ముధోల్ నియోజకవర్గంలో విద్యారంగంకు పెద్ద పీట వేస్తున్నానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని బ్రహ్మన్ గావ్ గ్రామంలో శుక్రవారం రూ.40 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, అలాగే మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో శుక్రవారం భూమి పూజ చేశారు. అలాగే గన్నోర గ్రామంలో రూ.40 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, ఎడ్ బిడ్ గ్రామంలో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో భూమి పూజ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశంలోఎమ్మెల్యే మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రహరీ గోడ నిర్మాణంతో వారికి పూర్తి రక్షణకు  తోడ్పడుతుందని అన్నారు. మహిళా సమైక్య సంఘ భవనాల ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో రాణించటానికి వేదికలన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని, విద్యా రంగం ,మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో సూపర్డెంట్ అశోక్, ఎటిఎం గురుచరణ్, ఎపిఓ శిరీషారెడ్డి, పంచాయతీ కార్యదర్శి లు శివరెడ్డి, రాజు, సర్పంచుల అప్పల రాజు, రాంచందర్ రెడ్డి, మౌనిక మహేందర్ రెడ్డి, మండల నాయకులు, తదితరులు అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -