Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్11వ వార్షికోత్సవానికి ముస్తాబైన సాయిబాబా ఆలయం 

11వ వార్షికోత్సవానికి ముస్తాబైన సాయిబాబా ఆలయం 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ 11వ వార్షికోత్సవాలు ఈ నెల 8న వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని స్థానికులు ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. అనంతరం సాయిబాబా ఆలయ కమిటి అధ్యక్షులు బోశివార్ ప్రకాష్ మాట్లాడుతూ.. వార్షికోత్సవానికి గ్రామ ప్రజలు భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఆదివారం ఉదయం కాకడ హరతీ, అనంతరం బాబా వారికి పంచామృత అభిషేకం, మధ్యాహ్న హారతి తర్వాత ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. రాత్రి 7 గంటలకు మల్లయ్యగిరి దేగలమడి ఆశ్రమ పీఠాధిపతి పూజ్యశ్రీ డాక్టర్ బసవలింగ, అవదూత ప్రవచన కార్యక్రమం ఉంటుందని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -