– అభినందించిన గ్రామ సర్పంచ్, గ్రామస్తులు
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
కామారెడ్డి జిల్లా, బీబీపేట మండల పరిధిలోని జనగామ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి కుమార్తెలు ఆరాధ్య, అవని లు అండర్ – 17 బ్యాడ్మింటన్ పోటీల్లో జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవడం గ్రామానికి గర్వకారణంగా ఉందని గ్రామ గ్రామస్తులు వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. చిన్న వయసులోనే క్రీడా రంగంలో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయిలో విజయం సాధించడం అభినందనీయం అని, వారి ఈ ఘనత జనగామ గ్రామానికే కాకుండా బీబీపేట మండలానికి కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, క్రీడాభిమానులు ఆరాధ్య, అవనిలను అభినందిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి కీర్తి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
జనగామకు గర్వకారణం జాతీయ బ్యాడ్మింటన్ విజేతలు
- Advertisement -
- Advertisement -



