Friday, February 6, 2026
E-PAPER
Homeజిల్లాలుపోలీస్ అమరవీర కుటుంబానికి సీఎం రూ. 1 కోటి సాయం

పోలీస్ అమరవీర కుటుంబానికి సీఎం రూ. 1 కోటి సాయం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రమోద్ కుమార్ పిసి: 1924  అక్టోబర్ 17న విధి నిర్వహణలో మరణించడం జరిగింది. విధి నిర్వహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ కుటుంబానికి శుక్రవారం నిజామాబాదు జిల్లా పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీర్తిశేషులు ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ. 1 కోటి విలువగల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ,టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ప్రమోద్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -