Saturday, February 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'టాక్సిక్‌' తెలుగు హక్కులు దిల్‌రాజు సొంతం

‘టాక్సిక్‌’ తెలుగు హక్కులు దిల్‌రాజు సొంతం

- Advertisement -

హీరో యశ్‌ నటిస్తున్న పాన్‌ ఇండిమా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. మార్చి 19న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్‌ చేస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను రూ.120 కోట్ల (అడ్వాన్స్‌ ఆన్‌ కమీషన్‌ బేసిస్‌)కు సొంతం చేసుకోవటం ఇండస్ట్రీలో డిస్కర్షన్‌ పాయింట్‌గా మారింది. నాన్‌ తెలుగు సినిమా కోసం జరిగిన ఆల్‌టైమ్‌ బిగ్గెస్ట్‌ డీల్‌గా ఇది హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఏపీ, తెలంగాణ హక్కుల కోసం మూడు అగ్ర సంస్థలు పోటీ పడగా చివరకు దిల్‌ రాజు నేతృత్వంలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు ఈ డీల్‌ దక్కింది. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్‌లో యశ్‌ ఒకరు. ‘కెజియఫ్‌ 2′ తర్వాత ఆయన మార్కెట్‌ మరింతగా పెరిగింది. ఆయన నెక్ట్స్‌ సినిమా కోసం ఆడియెన్స్‌ ఎంతో ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి ప్రెస్టీజియస్‌ మూవీని మా ఎస్‌వీసీ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండటం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -