Saturday, February 7, 2026
E-PAPER
Homeఆటలుముంబయి 120 ఆలౌట్‌

ముంబయి 120 ఆలౌట్‌

- Advertisement -

కర్నాటకతో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌
ముంబయి :
రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే కుప్పకూలింది. కర్నాటక బౌలర్లు విద్వత్‌ కావేరప్ప (3/38), ప్రసిద్‌ కృష్ణ (3/21), శ్రేయాస్‌ గోపాల్‌ (3/4) నిప్పులు చెరిగారు. ముంబయి బ్యాటర్లలో ఓపెనర్‌ అఖిల్‌ (60, 138 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. యశస్వి జైస్వాల్‌ (5), ముషీర్‌ ఖాన్‌ (1), సిద్దేశ్‌ లాడ్‌ (2), సూర్యాన్షు (10), ఆకాశ్‌ ఆనంద్‌ (2), శామ్స్‌ ములాని (0), తనుశ్‌ కొటియన్‌ (0), తుషార్‌ దేశ్‌పాండే (0) తేలిపోయారు. 48.1 ఓవర్లలో ముంబయి 120 పరుగులకే ఆలౌటైంది. కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో 110/2తో ఆడుతోంది. కెఎల్‌ రాహుల్‌ (28), దేవదత్‌ పడిక్కల్‌ (17) అవుటైనా.. మయాంక్‌ అగర్వాల్‌ (54 నాటౌట్‌), కరుణ్‌ నాయర్‌ (3 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. తొలి రోజు ఆట ముగిసేసరికి కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో మరో 10 పరుగుల వెనుకంజలో నిలిచింది.
బెంగాల్‌తో క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 264/6తో నిలిచింది. రికీ భురు (83), షేక్‌ రషీద్‌ (46), శ్రీకర్‌ భరత్‌ (47), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33) రాణించారు. బెంగాల్‌ పేసర్లు ముకేశ్‌ కుమార్‌ (3/50), ఆకాశ్‌ దీప్‌ (2/64) రాణించారు. జార్ఖండ్‌, ఉత్తరాఖాండ్‌ క్వార్టర్‌ఫైనల్లో.. జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఉత్తరాఖాండ్‌ 4/0తో ఆడుతోంది. మరో క్వార్టర్‌ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు ఆలౌట్‌ కాగా.. మధ్యప్రదేశ్‌ 28/0తో నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -