Saturday, February 7, 2026
E-PAPER
Homeఆటలుపతక ఆశలు ఆవిరి

పతక ఆశలు ఆవిరి

- Advertisement -

ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్స్‌
న్యూఢిల్లీ :
ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత పతక ఆశలు ఆవిరయ్యాయి. మహిళల జట్టు చైనా చేతిలో 0-3తో పరాజయం పాలవగా.. పురుషుల జట్టు 1-3తో దక్షిణ కొరియా చేతిలో ఓటమి చెందింది. శుక్రవారం జరిగిన మెన్స్‌ క్వార్టర్‌ఫైనల్లో తొలుత ఆయుష్‌ శెట్టి 21-14-24-26తో పోరాడి ఓడగా.. డబుల్స్‌లో హరిహరణ్‌, చిరాగ్‌శెట్టి జోడీ 1-21, 13-21తో నిరాశపరిచారు. కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 21-16తో గెలుపొంది ఆశలు రేపినా.. ఆ తర్వాత రెండో డబుల్స్‌లో ప్రథ్వీ, సాయిప్రతీక్‌లు 11-21, 16-21తో నిరాశపరిచారు. దీంతో మూడో సింగిల్స్‌ మ్యాచ్‌ ఉండగానే దక్షిణ కొరియా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల క్వార్టర్‌ఫైనల్లో తన్వీ శర్మ 9-21, 9-21తో, ట్రెసా జాలి-పుల్లెల గాయత్రి జోడీ 22-24, 18-21తో.. రక్షిత 21-14, 15-21, 17-21తో పరాజయం పాలయ్యారు. 3-0తో గెలుపొందిన చైనా సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -