Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపునివ్వండీ..

ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపునివ్వండీ..

- Advertisement -

ఎలక్షన్‌ కమిషన్‌కు కార్మిక సంఘాల వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వచ్చే నెల 12న జరగనున్న సార్వత్రిక సమ్మె క్యాంపెయిన్‌, సమ్మె రోజు జరిగే ప్రదర్శనలు, సభలకు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపునివ్వాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఐ రాణి కుముదినికి ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, టీయూసీఐ, ఐప్‌టీయూ, బీఆర్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ సంఘాలు వినతి పత్రాన్ని సమర్పించాయి.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, వీఎస్‌ రావు, కార్యదర్శి ఎం పద్మశ్రీ,ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాలరాజు, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్‌, బీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి మారయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని వారు పేర్కొన్నారు. 29 చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, విద్యుత్‌ సవరణ బిల్లు-2025ను వెనక్కి తీసుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం – 2005ను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఫిబ్రవరి 12న ఒక్క రోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కార్మిక, ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చాయనీ, సమ్మె నోటీసులిచ్చి రెండు నెల్లుగా క్యాంపెయిన్‌ చేస్తున్నారని తెలిపారు. సమ్మె ఏర్పాట్లు చివరి దశకు చేరాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్‌, కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై. ”మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌” అమలులోకి వచ్చిన నేపథ్యంలో కార్మికులకు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్మిక సంఘాలుగానే క్యాంపెయిన్‌ చేస్తున్నాము తప్ప రాజకీయ ప్రచారం చేయడం లేదని తెలిపారు. అందుకని సమ్మె రోజైన 12వ తేదీ వరకు ”ఎంసీసీ” నుండి మినహాయింపు ఇచ్చి సమ్మె క్యాంపెయిన్‌ చేసుకునేందుకు, సభలు, సమావేశాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -