Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవికారాబాద్‌లో విజయకేతనం ఎగురవేస్తాం

వికారాబాద్‌లో విజయకేతనం ఎగురవేస్తాం

- Advertisement -

బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అడ్రస్‌ గల్లంతు చేయాలి : ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

నవతెలంగాణ-వికారాబాద్‌
వికారాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వికారాబాద్‌ పురపాలక సంఘం ఎన్నికలలో పోటీ చేస్తున్న కౌన్సిలర్‌ అభ్యర్థులతో శుక్రవారం పట్టణంలోని సత్యభారతి గార్డెన్‌లో సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్‌, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ గంజి భాస్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో గత పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించామని తెలిపారు.

అదేవిధంగా మున్సిపల్‌ ఎన్నికలలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు కౌన్సిలర్‌ స్థానాలే ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు మంజూరు అవుతున్నాయన్నారు. మున్సిపాలిటీలోని అన్ని స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని తెలిపారు. సర్వే ప్రకారం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అడ్రస్‌లను గల్లంతు చేయాలన్నారు. ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వికారాబాద్‌ నియోజవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా చేయడానికి కృషి చేస్తున్నారని చెప్పారు.

ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. వచ్చే నాలుగు రోజులు కీలకమని గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి సంతోష్‌, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌, పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్‌రెడ్డి, గడ్డం అనన్య, నాయకులు మహిపాల్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, వి.సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్‌ కిషన్‌ నాయక్‌, ఎస్‌.కొండల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తాండూరు మున్సిపాలిటీ ప్రచారంలో మంత్రి పాల్గొని, మున్సిపాలిటీ సభ్యులను గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌ తిరిగి వచ్చే సమయంలో చేవెళ్ల మున్సిపాలిటీలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -