– 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రోజా నాగరాజ్ గౌడ్
నవతెలంగాణ-సదాశివపేట
గతంలో తాను వార్డులో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రోజా నాగరాజు గౌడ్ అన్నారు. వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలు తనను గతంలో ఆదరించి గెలిపిస్తే వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వార్డు ప్రజలు మరోసారి అవకాశం కల్పించి గెలిపిస్తే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ల సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
అభివృద్ధిని చూడండి.. ఆశీర్వదించండి …
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



