నవతెలంగాణ-సదాశివపేట
సదాశివపేట పట్టణంలోని 23వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి ప్రియాంక తులసి శుక్రవారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులను కలుసుకుని తమకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక తులసి మాట్లాడుతూ, ప్రజలు ఆదరించి ఓటు వేస్తే 23వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. వార్డులో ఎదురయ్యే ప్రతి సమస్యకు తానే ముందుండి పరిష్కారం చూపిస్తానని తెలిపారు.
ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తానన్నారు.ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించి వాటిని దశలవారీగా పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే నినాదంగా పనిచేస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రియాంక తులసి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



