Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ నిషేదానికి మహిళల సహకారం అవసరం: సర్పంచ్

ప్లాస్టిక్ నిషేదానికి మహిళల సహకారం అవసరం: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
ప్లాస్టిక్ వాడకం నిషేధంపై మహిళమనుల సహకారం ఎంతో అవసరమని గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. శనివారం అయన మండలకేంద్రములో మహిళ సంఘాలతో ప్లాస్టిక్ నిషేదం పై అవగాహణ కార్యక్రమము నిర్వహించారు. ఈసందర్బంగా ప్లాస్టిక్ వాడకం మానవాళికి ఎంత ప్రమాదమో వివరించారు. ఈరోజుల్లో ప్రతి చిన్న వస్తువును మనం ప్లాస్టిక్ ను వాడుతున్నామని అవి మనకు ఎంత హాని కలగజేస్తుందో మహిళలకు వివరించి చెప్పారు. దీన్ని నిషేదించడం కేవలం మహిళలతో మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.

అందుకే మీసహకారంతో మన గ్రామమునుండి ప్లాస్టిక్ నిషేదించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లుదామని ముందడుగు వేయడం జరిగిందని అన్నారు. మీపై నమ్మకంతో ఈకార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలలే ఆలోచనతో ఉన్నామని ఇందుకు మహిళమానులందరు సకరించాలని కోరారు. మహిళలు తలుచుకుంటే కానిదంటూ ఏది లేదని, ప్లాస్టిక్ నిషేధమనే ఉద్యమం మీ సహకారం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తేవాలని కోరారు. ఇకపై గ్రామములో ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వాడకూడదని ఇది మనకోసం మనందరి భాద్యత గా భావించి ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిషేదించేందుకు గ్రామస్థులందరి సహకారం తప్పక ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. కార్యక్రమములో గ్రామములోని అన్ని మహిళా సంఘాల మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -