Saturday, February 7, 2026
E-PAPER
Homeక్రైమ్గుర్తు తెలియని వ్యక్తి మృతి 

గుర్తు తెలియని వ్యక్తి మృతి 

- Advertisement -

–  గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తి
నవతెలంగాణ – కామారెడ్డి 

ఫిబ్రవరి 1న ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో రామారెడ్డి చౌరస్తా పరిధిలో ఒక గుర్తు తెలియని పురుషుడు రోడ్డుపై స్పృహలేని స్థితిలో పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న స్థానికులు అతడిని వెంటనే కామారెడ్డి  ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ మరళి ఆస్పత్రికి వెళ్ళి పరిశీలించామని తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కి రిఫర్ చేయగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 08:50 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నిజామాబాద్ మోర్చురీ గదిలో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. మృతుని వివరాలు తెలుసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ, ఇప్పటివరకు ఎవరూ మృతదేహాన్ని గుర్తించలేదని వెల్లడించారు.

మృతుడు సుమారు 35 – 40 వయస్సు గల పురుషుడనీ, హిందూ మతానికి చెందినవాడిగా అంచనా వేశామన్నారు.  భిక్షాటన చేసే వ్యక్తిగా భావిస్తున్నామని, మధ్యస్థ శరీర నిర్మాణం కలిగి, గడ్డం, మీసాలు ఉన్నాయి. జుట్టు నల్లగా కొంత చిందరవందరగా ఉంది. మృతుడు నీలం రంగు చెక్ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం లేదా గుర్తింపు ఉన్నట్లయితే, వెంటనే కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ ఫోన్ నెంబర్ 8712686145 ను సంప్రదించాలని కోరుతున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -