Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

- Advertisement -

– కౌంటింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలి 
–  సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్
నవతెలంగాణ – కామారెడ్డి 

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ లు పాల్గొని కౌంటింగ్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు  ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ  కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ సమయంలో ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సమన్వయంతో పని చేయాలని కౌంటింగ్ సిబ్బందికి సూచించారు.

అలాగే ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, తమ విధులను నిబద్ధతతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు తడ్వాయి శ్రీనివాస్,  నర్సింగరావు పాల్గొని, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాలు, చెక్ లిస్టులు, వివిధ ఫారాలు, లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లోపాలు తలెత్తకుండా పాటించాల్సిన అంశాలను సవివరంగా వివరించి అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పూర్తి నిష్పక్షపాతత్వం, పారదర్శకతతో పాటు ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా పాటించడం అత్యంత అవసరమని సూచించారు.

అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తూ, ఎలాంటి చిన్న తప్పిదానికి కూడా అవకాశం లేకుండా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి, తమ బాధ్యతలను అత్యంత జాగ్రత్తగా, సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, చట్టబద్ధంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అవగాహన కౌంటింగ్ సిబ్బందికి కల్పించబడిందని, ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -