Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు అభివృద్ధి కోసం సైనికుడిలా పని చేస్తా..

వార్డు అభివృద్ధి కోసం సైనికుడిలా పని చేస్తా..

- Advertisement -

ప్రజలకు అందుబాటులో ఉంటా..
12వ వార్డు అభ్యర్థి తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  

తమ అమూల్యమైన ఓటును చేయి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే 12 వ వార్డు అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర విజయలక్ష్మి వెంకటేశ్ యాదవ్ అన్నారు. పగిడిపల్లి, తాత నగర్ కు సంబంధించి  మౌలిక వసతులు కల్పించి భువనగిరి మున్సిపాలిటీలోనే ఆదర్శవంతమైన వార్డుగా   తీర్చిదిద్దుతానని అన్నారు. 

గత అనుభవంతో అభివృద్ధి చేస్తా..
గతంలో మా కుటుంబం నుంచి 2006 సంవత్సరంలో గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్న ప్రజలకు అందుబాటులో ఉంది సేవ చేసినట్లు తెలిపారు. మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో 2012 సంవత్సరంలో ఎంపీపీగా గెలిచి భువనగిరి మండలానికి ఐదు కోట్ల నిధులతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గత ఎన్నికలలో   పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినట్లు, వార్డు ప్రజలు సానుభూతితో పోటీ చేయాలని కోరగా ప్రజల కోరిక మేరకు మళ్ళీ   పోటీ చేస్తున్నట్లు, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ప్రచార సరళి ఎలా ఉంది..
పగిడిపల్లి, తాతా నగర్ కు సంబంధించి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు తమను ఆదరిస్తున్నారని, అక్కున   చేర్చుకుంటున్నారని అన్నారు. ప్రజల అభిమానంతో భారీ ఎత్తున నామినేషన్ వేసినట్లు తెలిపారు. భువనగిరి ఎమ్మెల్యే  కుంభం  అనిల్ కుమార్ రెడ్డి  ఆదేశాల మేరకు పోటీ చేస్తున్నట్లు,  ఎమ్మెల్యే సహకారంతో వార్డు ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

ప్రజలు గెలిపిస్తే ఏం చేస్తారు..
ప్రజలు గెలిపిస్తే వార్డులో స్మశాన వాటికలో మౌలిక వసతులు వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పగిడిపల్లికి సంబంధించి అండర్ పాస్   నిర్మిస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. తాత నగర్ పగిడిపల్లి లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా అన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -