లేదంటే బొగ్గుతవ్వకాలు నిలిపివేయండి
కాటారం సబ్ కలెక్టర్ తో తాడిచెర్ల నిర్వాసితులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మా ప్రాణాలు పోయిన మేము ఇండ్లను లీజుకు ఇచ్చుటకు ఒప్పుకొమని తాడిచెర్ల భూ నిర్వాసితులు తెల్సి చెప్పారు. శనివారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అధ్యక్షతన తాడిచెర్ల,కాపురం నిర్వాసితుల కమిటితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా సబ్ కలెక్టర్, జెన్కో అధికారులు మాట్లాడుతూ.. ఇండ్లను లీజుకు ఇవ్వాలని, డేంజర్ జోన్లో బొగ్గు లేదని, గతంలో ఉన్న ఇండ్లను మించి పెరిగిపోయాయని, ఇందుకు బడ్జెట్ ప్రభుత్వం వద్ద లేదని చెప్పడంతో ఒకేసారి నిర్వాసితులు లేచి గగ్గోలు పెట్టారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా లీజు ముచ్చట ఎలా మాట్లాడుతూన్నారని, ఏ జీవో ప్రకారం మాట్లాడారని నిలదీశారు. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని తెల్సి చెప్పారు. 500 మీటర్లు డేంజర్ జోన్లో భూములు, ఇండ్లకు తీసుకోవాలని ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని కోరారు. జెన్కో కంపెనీ, అధికారులు ఏస్ఈ, జిఎం అది నుంచి మోసం చేస్తేనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వన్ టైంలో సెటిల్ మెంట్లో డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్, బండి రాజయ్య, ఇందారపు చెంద్రయ్య, తాండ్ర మల్లేష్, అశోక్ రావు, సురేష్ రావు, కేశారపు చెంద్రయ్య, ఆర్ని సత్తయ్య, కేశారపు రవి, కెవడా, కుమార్ యాదవ్, ప్రభాకర్, మార్కు, శివ, ప్రశాంత్ తోపాటు వందమంది పాల్గొన్నారు.



