Saturday, February 7, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలి

- Advertisement -

మొరిగాడి భాగ్యలక్ష్మిగెలుపు కోరుతూ జాన్ వెస్లీ ప్రచారం
నవతెలంగాణ- ఆలేర్ రూరల్

ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మిని గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం పట్టణం లోని 4 వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్ధి మొరిగాడి భాగ్యలక్ష్మి గెలుపు కోరుతూ జరిగిన ఇంటి ఇంటికి ప్రచారం, ర్యాలీ, కాటమయ్య బజార్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్ధులను గెలిపించి ప్రజల కొరకు పనిచేసేవారికి పట్టం కట్టాలన్నారు. గతంలో అధికారంలో ఉన్నవారు ఆలేరు అభివృద్ధి చేసింది లేదని, ప్రస్తుతం అదే విధానం కొనసాగితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన వారు ప్రజల కోసం నిరంతరం పనిచేసే వారిని గెలిపించుకోవడం వలన ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పాలకవర్గంలో ప్రజా గొంతుకగా పనిచేస్తారని, ప్రజా సమస్యలు పరిష్కారం కాని యెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. అలా కాకుండా డబ్బుతో, మందుతో రాజకీయాలకు వచ్చే వారు ప్రజలకు సేవ చేయలేరని వారు సంపాదన కోసం రాజకీయాలకు వస్తారని తెలియజేశారు.  

ఐదు సంవత్సరాలపాటు ప్రజలు నాయకులను ఎన్ని కష్టాలు వచ్చినా భరించవలసి వస్తుందన్నారు. గత పాలకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయని ఆలేరు పట్టణంలో మురుగు కాలువల నిర్మాణం సీసీ రోడ్డు నిర్మాణం కమ్యూనిటీ హాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని ఐదు సంవత్సరాల కాలంలో కనీసం చెత్త డంపింగ్ యార్డ్ ను సైతం ఏర్పాటు చేసుకోవాలని దీన వ్యవస్థలో మున్సిపల్ వర్గం ఐదేళ్ల పాలన గడిచిపోయిందని అన్నారు. రాబోయే పాలవర్గంలో కమ్యూనిస్టులను ఒక్కరైనా గెలిస్తే ప్రజా సమస్యలపై నిరంతరం పాలకవర్గాన్ని నిలదీసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి జరుగుతుందన్నారు. నాల్గవ వార్డులో గతంలో గెలిచినవారు వార్డును గాలికి వదిలేసిన విషయం మీకు తెలిసింది అన్నారు. 

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటి సభ్యులు ఎం ఏ ఇక్బాల్, బొలగాని జయరాములు, నాయకులు మోరిగాడి రమేష్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ధూపటి వెంకటేష్, వడ్డేమాన్ బాలరాజు, గణగాని మల్లేష్, నల్ల మాస తులసయ్య, సంగీ రాజు, తాళ్లపల్లి గణేష్, బొప్పిడి యాదగిరి, చెన్న  రాజేష్, కాసుల నరేష్, మోరిగాడి రాజు లక్ష్మణ్  అశోక్ అంజయ్య, యాసరపు ప్రసాద్, గొడుగు దాసు, ఎండి మతిన్ ఎండి ఖలీల్, ఎండి అమీర్, మోరిగాడి పుష్ప స్వరూప చంద్రకళ, అయిలి అంజమ్మ చంద్రకళ, మోరిగాడి అనిత వాలి, చౌడబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -