Sunday, February 8, 2026
E-PAPER
Homeసినిమా'కాక్రోచ్‌' సెన్సార్‌ పూర్తి

‘కాక్రోచ్‌’ సెన్సార్‌ పూర్తి

- Advertisement -

సమాజం ఛీత్కరించుకునే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథ ‘కాక్రోచ్‌’. అడ్డురోడ్‌లో పడుపు వృత్తి చేసుకొనే వేశ్యకి, ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహమే ఈ సినిమా. భ్రష్టు పట్టిన అవినీతి సమాజపు చీకటిని మీకు పరిచయం చేసే చిక్కటి చిత్రం కూడా అని దర్శకుడు పి.సునీల్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. కాక్రోచ్‌ని చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే ద్వంద విలువల మనస్తత్వాలని ప్రశ్నించే పాత్రలతో తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్‌ బ్యానర్‌ పై బి. బాపిరాజు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. సున్నిత మనస్కులు, పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శక, నిర్మాతలు సవినయంగా పత్రికాముఖంగా కోరుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని మార్చి మొదటి వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ చిత్రంలో ఉన్న హింసాత్మక పోరాటాలను సహజంగా చూపించడానికి రియల్‌ ఫైటర్స్‌ని నటులుగా ఎన్నుకోవడం జరిగింది. అభిలాష్‌ సుంకర, ప్రేమసన్‌, నవీన్‌ నిజజీవిత ఆధారిత కిరాయి హంతకులుగా నటించగా, ‘సొంతవూరు’ చిత్రంలో ఉత్తమ నటి అవార్డు గ్రహీత తీర్థ ఒక ముఖ్య పాత్ర పోషించగా , మీనాక్షి, రామన్‌ , బుగత, అంజి, ప్రదీప్‌. సముద్రం వెంకటేష్‌ , మల్లిక, ఎఫ్‌ ఎమ్‌ బాబాయ్‌, రాజు, బాలాజీ , ఎల్‌ బీ రమణ ఆర్‌ కే సింగ్‌, పూజా, పొట్టి మూర్తి, ప్రసాద్‌, రేలారే రఘు బృందం, జానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రదీప్‌ చంద్ర , ఎడిటర్‌ రఘు, ఫైట్‌ మాస్టర్‌ : ప్రేమ్‌సన్‌, కెమెరా సంతోష్‌.లిరిక్స్‌ : ప్రతాప్‌, సౌండ్‌: నాగరాజు , నిర్మాతలు : బి బాపిరాజు , ముతుకి నాగ సత్యనారాయణ , రచన దర్శకత్వం: పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -