Sunday, February 8, 2026
E-PAPER
Homeఅంతరంగంజీవితం

జీవితం

- Advertisement -

ఈ భూమిపై జీవి పుట్టి లక్షల ఏండ్లు గడిచింది. ఇన్నేండ్ల చరిత్రలో బతుకు పోరాటం చేసిన జీవులు మాత్రమే మనగలిగాయి. ఈ పోరాటానికి మనుషులేమీ మినహాయింపు కాదు. ఒక విధంగా మిగిలిన జీవులకంటే మనుషులు అదనపు పోరాటం చేయాల్సిందే. విలాసం, సంతోషం, ఆనందం, కష్టం, సుఖం, దు:ఖం, బాధ అన్నింటినీ వెదుక్కొంటూ చాలా దూరం వచ్చారు. సాంకేతికపరంగా ఎన్నో అడుగులు ముందుకు వేశారు. కానీ దానికున్న పరిమితులను అర్థం చేసుకోలేక జీవితంలో ఓడిపోతున్నారు. ఇక్కడ ఆవేదన కలిగించే అంశం ఏమిటంటే బంధాలను, అనుబంధాలను పక్కన పెడితే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు.
తన ప్రేమను నిరాకరించలేదని కన్న తల్లిదండ్రులకు విష ఇంజక్షన్‌ ఇచ్చి కడతేర్చిన కూతురు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడో బిడ్డ అడ్డంగా ఉందని కన్న బిడ్డను చంపిన తండ్రి… ఇతర సంబంధాలకు అడ్డంగా ఉన్నాడరని భర్తను హతమార్చిన భార్య… తన అక్రమ తిరుగుళ్లను ప్రశ్నింస్తుందని భార్యని దహనం చేసిన భర్త… కూడా తెలియకుండా బిడ్డలతో సహా తమ కోర్కెలకు అడ్డంగా ఉన్నారని అయినవాళ్లనే హతమారుస్తున్న వారు కొందరుంటే… ఆన్‌లైనల్‌ గేమ్‌లకు బానిసలై ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి తమ ప్రాణాలే తీసుకుంటున్నవారు మరికొందరు. ఇక తాము అనుకున్నది జరగకపోతే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నవారూ ఉన్నారు. చివరకు ముక్కుపచ్చలారని పిల్లలు సైతం స్మాట్‌ఫోన్లకు బలైపోతున్నారు. కొరియన్‌ గేమ్‌లకు బానిసలై ప్రాణాలు తీసుకున్న ముగ్గురు అక్కచెల్లెళ్ల వార్త ఎందరో తల్లిదండ్రుల నిద్రను దూరం చేస్తోంది.
భారమైన జీవితం ఇక జీవించలేనంటూ ఇద్దరు బిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడిన ఓ తల్లి సంఘటన ఇటీవల కాలంలో ఓ సంచనలంగా మారింది. ఎందరినో కంటతడి పెట్టించింది. మరెందరినో ఆలోచించేలా చేసింది. ఇదొక్కటేనా… ఇటీవల కాలంలో పెరిగిపోతున్న హత్యలు, ఆత్మహత్యలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందా అనే ఆందోళన నిలవనీయకుండా ఉంది. కానీ నేడు ప్రాణం తీయడం, ప్రాణం తీసుకోవడం ఇవరి రెండూ ఓ సాధారణ విషయాలుగా మారిపోయాగా అనే భయం వెంటాడుతోంది.
జరుగుతున్న ఈ దారుణలకు కారణాలు ఏంటీ? వారిని అలాంటి స్థితికి నెట్టివేస్తున్న పరిస్థితులేంటీ? నిజానికి ఏ అసహజ మరణం వెనుకైనా ఒంటరితనం, కసి, బాధ, కోపం, ఆవేశం, ఆవేదన, బాధ, కుంగుబాటు ఉంటాయి. ఈ ప్రపంచీకరణ యుగం మనుషులను ఒంటరి వాళ్లను చేస్తోంది. నిజం చెప్పాలంటే యంత్రాలుగా తయారు చేస్తోంది. చిన్న కష్టాన్ని, బాధను కూడా భరించలేని స్థితికి తీసుకొస్తుంది. మనుగడ కోసం పోరాడాల్సిందే అనే ప్రకృతి ధర్మాన్ని మర్చిపోయే మత్తులో మనిషిని ముంచేస్తుంది. ఆత్మీయులతో కడపాల్సిన సమయాన్ని యంత్రాలకు అప్పగించేలా చేస్తుంది. కార్పొరేట్‌ వ్యాపారులు తమ లాభాల కోసం మనిషి జీవితాన్నే ఫణంగా పెడుతున్నారు. వీటిపై పోరాటం చేయనంత కాలం ఇలా ప్రాణాలు తీస్తూ, కోల్పోతూ ఉండాల్సిందే. నేటి మనిషి మనిషిలా జీవించాలంటే ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనం దాగి వుందో, ఎవరి లాభాల కోసం తమ ప్రాణాలను బలిస్తున్నారో అర్థం చేసుకోవాలి. సమస్యలపై పోరాడే శక్తిని పుంజుకోవాలి. అలాంటి పరిస్థితులను ప్రతి మనిషి తనకు తానే సృష్టించుకోవాలి. ఈ సమాజంలో ఓ మంచి మార్పుకు నాంది కావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -