హీరో శివాజీ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై 2వ చిత్రంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లయ శివాజీకి జంటగా నటించారు. రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 12న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ‘ట్రైలర్ చూశా. సూపర్‌గా ఉంది. చాలా నవ్వుకున్నా. డైరెక్టర్ సుధీర్ రైటింగ్, ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చూడాలని క్యూరియాసిటీ పెరిగింది. ఈ టీవీ విన్ వారు సక్సెస్ ఫుల్ సినిమాలతో ముందుకెళ్తున్నారు.
శివాజీ టాలెంటెడ్ యాక్టర్, తెలుగు అమ్మాయి లయ సెకండ్ ఇన్నింగ్స్‌లో ముందుకెళ్తున్నారు. ఆమె క్యారెక్టర్ సూపర్‌గా ఉంది. ఈనెల 12కి ఈటీవీ విన్లో రాబోతున్న ఈ సినిమా చూసి ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయడం పక్కా’ అని అన్నారు. ‘బండ్ల గణేష్ ఈ సినిమా కోసం సాంగ్ చేద్దాం అనగానే చేసేద్దాం అన్నాడు. బండ్ల గణేష్‌కు ఎంతో రుణపడి ఉన్నా. ఈ సినిమాలో అందరూ బాగా నటించారు’ అని ప్రొడ్యూసర్, యాక్టర్ శివాజీ చెప్పారు. లయ మాట్లాడుతూ, ‘ఇప్పటివరకు రత్నమాలగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ఉత్తరగా గుర్తు పెట్టుకుంటారని నమ్ముతున్నా’ అని తెలిపారు.
అందరికీ నచ్చే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



