Sunday, February 8, 2026
E-PAPER
Homeఆటలువిండీస్‌ శుభారంభం

విండీస్‌ శుభారంభం

- Advertisement -

స్కాట్లాండ్‌పై 35 పరుగులతో గెలుపు

కోల్‌కతా : ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. బ్యాట్‌తో, బంతితో ఆల్‌రౌండ్‌ షో చేసిన కరీబియన్లు శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (64, 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. రూథర్‌ఫోర్డ్‌ (26), రోవ్‌మాన్‌ పావెల్‌ (24), బ్రాండన్‌ కింగ్‌ (35)లు రాణించారు. ఛేదనలో స్కాట్లాండ్‌ 18.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. రొమారియో షెఫర్డ్‌ (5/20) ఐదు వికెట్లు పడగొట్టగా, జేసన్‌ హౌల్డర్‌ (3/30) మూడు వికెట్లతో మెరిశాడు. స్కాట్లాండ్‌ తరఫున రిచీ బెరింగ్టన్‌ (42), టామ్‌ బ్రూస్‌ (35) ఆకట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -