Sunday, February 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌ హామీలెక్కడ‌?

కాంగ్రెస్‌ హామీలెక్కడ‌?

- Advertisement -

తులం బంగారం, రూ.4వేల పింఛన్‌ ఇవ్వలే..
బీడీ కార్మికులకు పింఛన్‌ ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తులం బంగారం, రూ.4వేల పెన్షన్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ హామీ అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్లలోని పలు వార్డుల్లో పర్యటించి మాట్లాడారు. బీడీ కార్మికులకు పింఛన్‌ ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌ అని, సిరిసిల్ల కార్మికులకు బతుకుదెరువు కోసం కేసీఆర్‌ బతుకమ్మ చీరలు ఇచ్చారని అన్నారు. కులం, మతం మన కడుపులోకి బువ్వ పెట్టదని పట్టణ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. బతుకునిచ్చిన కేసీఆర్‌ కావాలా..? బతుకు ఆగం చేసిన కాంగ్రెస్‌, బీజేపీలు కావాలా? మీరే ఆలోచించుకోవాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేస్తే కేసీఆర్‌, కేటీఆర్‌కు ఓటు వేసినట్టేనన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -