నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ఆదివారం కొనసాగించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజు గౌడ్ హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వార్డు ప్రజలకు వివరించారు.12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాక చిరంజీవి ప్రచార ర్యాలీ వార్డు అధ్యక్షులు చెరుకు లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో రోడ్లు,రేషన్ కార్డులు,ఉచిత బస్సు ప్రయాణం,రైతు రుణమాఫీ,గృహ జ్యోతి, సీఎం రిలీఫ్ ఫండ్,ఎల్ఓసి చెక్కులు వంటి పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నాయని తెలిపారు.అలాగే, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే నాయకుడని పేర్కొన్నారు.12 వార్డు అభివృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేసే అభ్యర్థి పాక చిరంజీవిని గెలిపించాలని, అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బొంగు జంగయ్య గౌడ్, కంచరకుంట్ల వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ బుంగపట్ల భారతమ్మ, మాజీ కౌన్సిలర్ సుల్తాన్ రాజు, వార్డ్ ఇన్చార్జిలు మాధగొని శేఖర్ గౌడ్, బక్క శ్రీనాథ్, తీగుళ్ల బాలరాజు, పార్టీ సీనియర్ నాయకులు తమ్మకొండ రాజు, మాస సుధాకర్, మానుపాటి వెంకటేశ్వర్, బొమ్మకంట శివ, సుల్తాన్ శేఖర్, జాజుల శివ, అల్లి కృష్ణ, సాయి, కంచరకుంట్ల శశిధర్ రెడ్డి, తేలుకుంట్ల నవీన్, మహిళా నాయకురాలు మాజీ ఉప సర్పంచ్ పాక పద్మ, బొబ్బిల సంధ్య, రెడ్డి లక్ష్మి, చిందం జ్యోతి, జిట్టం, కవిత, కౌసల్య, బుడ్డా దివ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టండి…దోపిడీకి కాదు పబ్బు రాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



