నవతెలంగాణ-జన్నారం
నిర్మల్ జిల్లా లోని ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ అధికారిక జయంతి వారోత్సవాలను ఈనెల 20వ తేదీన ఖానాపూర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ జయంతి ఉత్సవాలకు లంబాడా బంజారాహిలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్ అన్నారు.. ఆదివారం జన్నారంలో మీడియాతో మాట్లాడారు. ఇది జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ వస్తున్నారన్నారు . ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారం మండల పరిధిలోని గిరిజన తండాలోని బంజారా గిరిజనులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.. కార్యక్రమంలో భాగంగా గిరిజన దర్బారు నిర్వహిస్తున్నందున జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గానికి వచ్చే గిరిజనులు తమ వినతి పత్రాలను సమస్యలను సంబంధించిన దరఖాస్తులు కూడా సమర్పించవచ్చన్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ నాయక్,శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ వారోత్సవాలకు తరలిరండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


