- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్లలోని పాత హైస్కూల్ క్రీడా మైదానంలో ఆకుల లక్ష్మీ స్మారకార్థం మండల స్థాయి షటిల్ టోర్నీని ఈ నెల 10 నుంచి 12 వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఆకుల రాకెష్,ఆర్ని రాజబాబు ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోర్నీ ఎంట్రీ పిజు రూ.300 ఉంటుందన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రూ.5016,ద్వితీయ బహుమతి రూ.3016,బెస్ట్ ప్లేయర్ కు ప్రత్యేక అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు.పూర్తి వివరాలకు 9533101176, 891959443 నెంబర్లను సంప్రదించాలన్నారు
- Advertisement -



