Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐడియా అదుర్స్..కోతులు పరార్.!

ఐడియా అదుర్స్..కోతులు పరార్.!

- Advertisement -

వానరాలను తరిమేందుకు ఉప సర్పంచ్కి చింపాంజీ వేషం
కొయ్యుర్ సర్పంచ్, సర్పంచ్ వినూత్న ఆలోచన.
నవతెలంగాణ – మల్హర్ రావు.

గ్రామాల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కోతులను తరిమేందుకు మండలంలోని కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ, ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ వినూత్న ఆలోచన చేశారు. ఉప సర్పంచ్కి చింపాంజీ వేషం వేయించి కోతులు సంచరించే ప్రాంతాల్లో తింపుతున్నారు. దీంతో కోతులు భయపడి వెళ్లిపోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రమవడంతో సరికొత్త ఆలోచనతో కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టారు. చింపాంజీ వేషంతో కోతులు భయపడి ఊరి పొలిమేరలకు వెళ్లిపోతున్నాయి. సర్పంచ్,ఉప సర్పంచ్ ఆలోచనతో తమకు కోతుల బెడద నుంచి ఉపశమనం లభిస్తోందంటూ చింపాంజీ వేషం వేసుకున్న ఉప సర్పంచ్ని అభినందిస్తున్నారు. గ్రామం నుంచి కోతులు పూర్తిగా వెళ్లిపోయే వరకు ప్రతీరోజు సిబ్బంది చింపాంజీ వేషంలో వీధుల్లో తిరుగుతాడని సర్పంచ్ పేర్కొన్నారు. కొయ్యుర్ సర్పంచ్,ఉప సర్పంచ్ చేసిన ఆలోచన తరహాలోనే మిగతా గ్రామాల సర్పంచ్లు కోతులను తరిమివేసేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -