కథానాయకుడు నిఖిల్ తన 20వ చిత్రం ‘స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్ ఈనెల 11న రిలీజ్ కానుంది. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో నిఖిల్ యాక్షన్ లుక్ అదిరిపోయింది.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. ఇందులో తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. రాజమౌళితో ఐకానిక్ సినిమాలు అందించిన కె.కె.సెంథిల్ కుమార్ డిఓపిగా పనిచేయడం విశేషం. ‘కేజీఎఫ్, సలార్’ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం. ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్స్. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
అంచనాలు పెంచేలా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



