కౌలాలంపూర్: రక్షణ , భద్రత, సెమీకండక్టర్ , వాణిజ్య రంగాల్లో సహకార బలోపేతానికి ఇరుదేశాలు చర్యలు చేపట్టనున్న ట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో విస్తత చర్చల అనంతరం ప్రధాని మోడీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. భారత్, మలేషియాలు ప్రత్యేక సంబంధాన్ని పంచుకుంటున్నా యని, విభిన్న రంగాల్లో తమ సంబంధాలను విస్తరించుకోవడానికి ఇరు వైపులా కట్టుబడి ఉన్నామని అన్నారు. నావికా రంగంలో పొరుగుదేశమని, శతాబ్దాలుగా ఇరు దేశాల ప్రజలు ఆప్యాయతతో ధడమైన సంబంధాలను కలిగి ఉన్నారని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశ వైఖరి స్పష్టంగా ఉందని, ద్వంద్వ ప్రమాణాలు లేవని, రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు.
నేడు మలేషియా భారతీయ సంతతికి చెందిన జనాభాతో ప్రపంచం లోనే రెండవ అతిపెద్ద దేశంగా ఉందని, మన నాగరికతలు, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు ఒకదానితో ఒకటి ముడివేసుకుని ఉన్నాయని మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, నిఘా భాగస్వామ్యం, సముద్ర భద్రతలో ఇరుదేశాలు సహకారాన్ని బలోపేతం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వద్ధి చోదకంగా అభివద్ధి చెందుతోందని అన్నారు. ఆసియాన్ (ఆగేసియా దేశాల సంఘం)తో కలిసి మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివద్ధి, శాంతి, స్థిరత్వానికి భారతదేశం కట్టుబడి ఉందని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడి మలేషియా సహకారాన్ని విస్తరిస్తున్నాయని మలేషియా ప్రధాని ఇబ్రహీం అన్నారు. ప్రపంచ వాణిజ్యం మరియు ఆర్థికరగంలో భారతదేశం అద్భుతమైన వద్ధిని నమోదు చేసిందన్నారు. మలేషియాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ కౌలాలంపూర్ చేరుకున్న సంగతి తెలిసిందే.
వాణిజ్యరంగంలో సహకార బలోపేతానికి ఇరు దేశాలు చర్యలు : ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



