
– అటవీ ఉత్పత్తులపై ఏజెన్సీలో విస్తృత పర్యటన
నవతెలంగాణ- తాడ్వాయి
అటవీ ఉత్పత్తులను దళారులకు తక్కువ రేటుకు అమ్మి మోసపోవద్దని, గిరిజన సహకార సంస్థ (జి సి సి) ఏటూర్ నాగారం డివిజనల్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. గత మూడు రోజుల నుండి తాడ్వాయి ఏజెన్సీలోని గ్రామాలలో జి సి సి మేనేజర్ దేవ్, సిబ్బందితో కలిసి అడవి ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలపై విస్తృతంగా పర్యటించారు. ఇప్పపువ్వు, విష ముష్టి గింజలు, అడవి ఉత్పత్తులు సేకరిస్తున్న ఆదివాసి కుటుంబాల తో కలిసి వారికి అడవి ఉత్పత్తుల సేకరణపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిసిసి డివిజనల్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… శాస్త్రీయ పద్ధతిలో ఇప్పపువ్వు, ముష్టి గింజలు, తేనె, చీపుర్లు చింతపండు చిల్లగింజలు, ఉసిరి, తప్సి జిగురు మొదలగు అటవీ ఉత్పత్తులను సేకరించాలని అవగాహన కల్పించారు. అడవి ఉత్పత్తులను దళారులకు తక్కువ ధరకు విక్రయించే రాదని చెప్పారు. జిసిసి ద్వారానే కొనుగోలు చేసి ఆదివాసి కుటుంబాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరేలా సహాయ పడుతుందన్నారు. అడవి ఉత్పత్తులకు గతంలో కాకుండా రేటు డబల్ పెరిగిందని, ఆదివాసీ గిరిజనులకు అదనపు ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిసిసి మేనేజర్ జాటోతు దేవ్, జూనియర్ అసిస్టెంట్లు సాంబయ్య, సతీష్, సేల్స్ మెన్ లు రాజయ్య, బద్రు, అటవీ ఉత్పత్తి సేకరణదారులు, తదితరులు పాల్గొన్నారు.