Monday, February 9, 2026
E-PAPER
Homeజాతీయంపొలాల్లో కూలిపోయిన శిక్షణా విమానం

పొలాల్లో కూలిపోయిన శిక్షణా విమానం

- Advertisement -

కెప్టెన్‌, ట్రైనీ పైలట్‌కు గాయాలు
ఇంజిన్‌లో సాంకేతిక లోపంతోనే..
కర్నాటకలోని విజయపుర జిల్లాలో ఘటన
బెంగళూరు :
ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఓ ప్రయివేట్‌ శిక్షణా విమానం పొలాల్లో కుప్పకూలింది. ఈ ఘటన కర్నాటకలోని విజయపుర జిల్లాలో ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో కెప్టెన్‌, ట్రైనీ పైలట్‌ గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రెడ్‌ బర్డ్‌ ఏవియేషన్‌కు చెందిన తేలికపాటి శిక్షణా విమానం కలబురగి నుంచి బెలగావికి బయలుదేరింది. మార్గమధ్యలో విజయపుర జిల్లా పరిధిలోని మంగళూరు సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని పొలాల్లో అత్యవసరంగా దించే ప్రయత్నం చేయగా అదుపుతప్పి కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో విమానంలో కెప్టెన్‌, ట్రైనీ పైలట్‌ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సమాచారం అందుకున్న బాబలేశ్వర్‌ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరినీ స్థానికుల సహకారంతో అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -