– యువతికి వీడియో కాల్ చేసి యువకుడి ఆత్మహత్య
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రేమ వ్యవహారం విషాదంగా మారిన ఘటన మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోడుప్పల్ సర్కిల్ సమీపంలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో నివసించే ఓ ప్రయివేటు ఉద్యోగి కుమారుడు గంగధారి అభినవ్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు నగరంలోని ఐఐటీ కళాశాలలో చదువుతూ మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 5న కుటుంబ సభ్యులు షాపింగ్ కోసం బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు తాను ప్రేమిస్తున్న యువతికి వీడియో కాల్ చేస్తూ ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. తరువాత ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకున్నాడు. యువతి అప్రమత్తమై అతడి స్నేహితులకు ఈ విషయం తెలిపింది. వారు వెంటనే ఇంటి తలుపు బలవంతంగా తెరచి, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే యువకుడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రేమ వివాదం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



