Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం15న సంత్‌ సేవాలాల్‌ 287వ జయంతి వేడుకలు

15న సంత్‌ సేవాలాల్‌ 287వ జయంతి వేడుకలు

- Advertisement -

– తెలంగాణ జాగృతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సంత్‌ సేవాలాల్‌ 287వ జయంతి వేడుకలను ఫిబ్రవరి 15న ఘనంగా నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగతి తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌.రూప్‌ సింగ్‌ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎవరు చేయని విధంగా భోగ్‌ బండార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బంజారా గురువులు చాలా మంది రానున్నారని చెప్పారు. బంజారాల విషయంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం పెద్గగా శ్రద్ధ చూపలేదని విమర్శించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత బంజారాల విషయంలో ఎంతో అధ్యయనం చేశారనీ, బంజారాలను, ఆదివాసీలను ఏకం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. కవిత బంజారా పూజారులను ఇంటికి పిలిచి వారికి నమస్కరించి గౌరవించారని తెలిపారు. అదే విధంగా ఏపీలోని హథిరాం మఠాన్ని ఏపీ ప్రభుత్వం కూలగొట్టే ప్రయత్నం చేస్తే అక్కడి సీఎం, టీటీడీ చైర్మెన్‌, అధికారులతో మాట్లాడి కూలగొట్టకుండా ఆపారని గుర్తుచేశారు.15న నిర్వహించే భోగ్‌ బండార్‌ కార్యక్రమంలో కవిత పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాగృతి బంజారా నాయకులు బి.కిషన్‌ నాయక్‌, బి.సంజీవ్‌ నాయక్‌, బానోత్‌ వెంకట్‌ నాయక్‌, దేవి బాయి, పున్ని బాయి, రాంజి నాయక్‌, గుగులోత్‌ శ్రీనివాస్‌ నాయక్‌, బాలు నాయక్‌, కుమార్‌ నాయక్‌, ప్రేమ్‌ కుమార్‌, ప్రవీణ్‌ నాయక్‌, కృష్ణ నాయక్‌, జీవన్‌ నాయక్‌,, రామ చావలి బాయి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -