ఓటుకు నోటు కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకే
అదంతా ప్రణాళిక ప్రకారమే
కేంద్రం జోక్యం చేసుకోవాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ – నక్కలగుట్ట
ఓటుకు నోటు కేసులో ఆధారాలను తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన మున్సిపాలిటీలలో 136 స్థానాలు విజయం సాధించామని, ప్రస్తుత ఎన్నికల్లో అధిక స్థానాలు సాధిస్తామని, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి ఫలితం వస్తుందని అన్నారు. 2015లో జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో తప్పించుకోవడం కోసం, మున్సిపల్ ఎన్నికల్లో అంతా బిజీగా ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం అనే కుట్రకు తెర లేపారని ఆరోపించారు.
చలికాలంలో అగ్నిప్రమాదం అసత్యమని, ఓటుకు నోటు కేసులో తప్పించే కుట్రలో భాగంగానే ఒక ప్రణాళికతో ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉన్న ఆధారాలను తొలగించే ప్రయత్నంగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి లాలూచీ పడి సాక్ష్యాలు చెరిపివేయడంపై నిజాన్ని నిగ్గు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రేవంత్‌రెడ్డి మంటలు పెట్టారని ఆరోపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు ఏమైనా ఈ ఘటన వెనుక ఉన్నారా అనే విషయం నిగ్గు తేల్చాలి అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్‌రెడ్డి పాత్ర పైన నిష్పాక్షిక విచారణ జరగాలని కోరారు.
కేంద్రం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో రేవంత్‌రెడ్డితో పాటు వేలాది మంది ఘోరమైన నేరస్తుల కేసులకు సంబంధించిన సాక్ష్యాలు దగ్ధమయ్యాయని అన్నారు. వారందరికీ ఈ రోజు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభిస్తుందని చెప్పారు. రేవంత్‌రెడ్డి బడే భారు (బీజేపీ)కి సంబంధం లేకుంటే ఈ అంశంపై విచారణకు ఆదేశించాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కుట్రగా భావిస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసు దాదాపు ముగింపు దశకు వచ్చి శిక్ష పడుతుందన్న కారణంగానే హౌం శాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈ ప్రమాదం వెనుక ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. మూడు అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదాన్ని.. మొదటి అంతస్తులో ఉన్న అగ్ని కీలలను ఆర్పడానికి మూడున్నర గంటల సమయం పట్టిందంటే ఇంతకు మించి కుట్ర అనడానికి వేరే విషయం అవసరం లేదని కేటీఆర్ చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన తీరుపై ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అత్యంత కట్టుదిట్టమైకన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చలికాలంలో అగ్ని ప్రమాదం జరగడం, 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఉద్యోగులెవరూ లేరని చెప్పడం, ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం తర్వాత మొత్తం 2015 నుంచి పదేండ్ల పాటు అనేక కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్‌రెడ్డి చేయించిన పనేనని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్ని ప్రమాదంలో సీఎం హస్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



