Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు భరోసాకు రూ.9వేల కోట్లు అప్పు

రైతు భరోసాకు రూ.9వేల కోట్లు అప్పు

- Advertisement -

ఇచ్చేందుకు ఓకే చెప్పిన రిజర్వుబ్యాంక్‌
రూ.90వేల కోట్లకు చేరిన రాష్ట్ర రుణం


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రప్రభుత్వం అప్పుకోసం మరోసారి రిజర్వుబ్యాంక్‌ (ఆర్‌బీఐ) గడప తొక్కింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల కోసం మరో రూ.9 వేల కోట్లు కావాలని కోరుతూ రిజర్వుబ్యాంకును అభ్యర్థించింది. దీనికి ఆర్బీఐ అంగీకరించింది. ఈనెల 10న ప్రభుత్వ ఖజానాకు నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ రుణాన్ని 13 ఏండ్ల కాలపరిమితితో రూ.రెండు వేల కోట్లు, 16 ఏండ్ల కాలపరిమితితో రూ.రెండు వేల కోట్లు, 21 ఏండ్లతో రూ.2,500 కోట్లు, 27 ఏండ్ల కాలపరిమితితో రూ.2,500 కోట్లు చొప్పున మొత్తం రూ.9 వేల కోట్లు తీసుకుంటున్నట్టు తెలిసింది.

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత రైతు భరోసా సొమ్మును ఖాతాల్లో జమచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకుంటున్న రూ.9 వేల కోట్ల అప్పుతో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు దాదాపు రూ.90 వేల కోట్లకు చేరుతున్నది. జనవరి 10వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.80,800 కోట్లు ఉన్నదని ‘కాగ్‌’ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ అంచనాలో ప్రభుత్వ అప్పు దాదాపు రూ. 54,009 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆ అంచనాకు రెట్టింపు రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్థికరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక 50 రోజులు మాత్రమే గడువు ఉన్న విషయం గమనార్హం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -