Friday, June 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడాక్ట‌ర్ల స‌మ్మె... ఓపీ సేవ‌లు బంద్

డాక్ట‌ర్ల స‌మ్మె… ఓపీ సేవ‌లు బంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నేటి నుంచి డాక్ట‌ర్ల స‌మ్మె కార‌ణంగా రాష్ట్రవ్యాప్తంగా ఓపీ సేవ‌లు నిలిచిపోనున్నాయి. బదిలీల్లో తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తామని TG ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. జీవో నెం. 38 నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలను ఉదృతం చేస్తామని TGGDA హెచ్చరించింది. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవలను పూర్తిగా బంద్ చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -