Tuesday, August 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅవే అసలైన సంపద..

అవే అసలైన సంపద..

- Advertisement -

హీరో రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఇరుముడి కట్టు’తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే జోరును కొనసాగిస్తూ, కుటుంబ బంధాలలోని ఆప్యాయతను అందంగా చాటిచెప్పే రెండవ పాట ‘యాలాలో యాలాలో’ను చిత్ర బృందం విడుదల చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలే అసలైన సంపద అనే భావాన్ని హృదయానికి హత్తుకునేలా చెబుతుంది. హెషామ్ అబ్దుల్ వహాబ్, సాధికా కెఆర్ ఆలపించిన తీరు పాటకు మరింత భావోద్వేగాన్ని జోడించింది.
ఈ పాట ద్వారా సినిమా ఎమోషనల్ కోర్‌ను కూడా మేకర్స్ చూపించారు. రవితేజ కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించే ఓ ఆటో డ్రైవర్‌గా కనిపిస్తారు. మద్యానికి బానిసైనప్పటికీ కుటుంబం కోసం తపించే తండ్రి పాత్రలో ఆయన సహజమైన నటన ఆకట్టుకుంటోంది. ప్రియ భవాని శంకర్ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే భార్య పాత్రలో మెప్పించగా, బేబీ నక్షత్ర తండ్రితో విడదీయలేని అను బంధం ఉన్న కూతురిగా మనసుని తాకింది. పాటలోని ప్రతి విజువల్, ప్రతి ఎమోషన్ సాహిత్యానికి అద్భుతంగా తోడై కుటుంబ బంధాలను ఎంతో సహజంగా చూపించింది అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -