Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘ఇరుముడి’ టీమ్‌కి మెగాస్టార్‌ అభినందనలు

‘ఇరుముడి’ టీమ్‌కి మెగాస్టార్‌ అభినందనలు

- Advertisement -

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా ఇటీవల విడుదలై విశేష ప్రేక్ష‍కాదరణతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్ష‍న్లను రాబడుతూ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ‘ఇరుముడి’ చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించిన చిరంజీవి, వారిని వ్యక్తిగతంగాభినందించారు.
రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రామ్ చరణ్ కూడా ఈ సందర్భంగా వారితో కలిసి ముచ్చటించారు.
బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ అంచనాలను మించి అద్భుతమైన విజయాన్ని అందుకుంటూ, సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలోనూ సినిమా జోరు తగ్గలేదు. నేటి షోలకు కూడా బలమైన బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఇలాంటి భారీ థియేట్రికల్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి ఆహ్వానించి అభినందించడం ‘ఇరుముడి’ టీమ్‌కు ప్రత్యేకమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భంగా నిలిచింది. ‘ప్రేక్ష‍కులు మా సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలోని ఎమోషన్‌ అందరికీ బాగా కనెక్ట్‌ అయ్యింది. ముఖ్యంగా మేం చెప్పాలనుకున్న సెన్సిటీవ్‌ పాయింట్‌ అందరికీ బాగా రీచ్‌ కావడం ఆనందంగా ఉంది. సినిమాలో విషయం ఉంటే ప్రేక్ష‍కులు ఎంతటి ఘన విజయాన్ని అందిస్తారో మా సినిమా మరోమారు నిరూపించింది. అటు ప్రేక్ష‍కులు, ఇటు సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన మా సినిమాని, మా చిత్ర బృందాన్ని మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా వారి ఇంటికి పిలిచి, అభినందించడం చాలా ఆనందంగా ఉంది’ అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -