మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రైమ్ షో ఎంటర్టై న్మెంట్ ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేయనుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నటుడు సుమన్ టీజర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ,‘చంద్ర మహేష్ క్లారిటీతో ఉండే అద్భుత మైన దర్శకుడు. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుం దని భావిస్తున్నాను.’ అని అన్నారు. ‘ఈ చిత్రంతో చంద్ర మహేష్‌కి మంచి విజయం దక్కాలి. చంద్ర మహేష్ నిర్మాతల డైరెక్టర్’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘చంద్ర మహేష్ ఈ కథ చెప్పిన ప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. చంద్ర మహేష్ అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుంది. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఇది అందరి ఇళ్లలో వుండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ వుంది’ అని అన్నారు. ‘ఈ సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు.ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడండి’ అని దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు.
అందరూ కనెక్ట్ అయ్యేకథ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



