తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కె ట్ను విస్తరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేస్తోంది.
తమిళంలో నిర్మిస్తున్న తమ నాలుగో చిత్రాన్ని ధృవ్ విక్రమ్ తో తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడు. విభిన్నమైన, ఇంటెన్స్ పాత్రల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ విక్రమ్.. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులను కనెక్ట్ చేసే కమర్షియల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జాకీ – నో రీటేక్స్ అలౌడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌లో ధృవ్ విక్రమ్‌ను ఫుల్ మాస్, లార్జర్ దేన్ లైఫ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. గ్రిట్టీ లైవ్ యాక్షన్ ట్రీట్మెంట్ను స్టైలిష్ కామిక్ బుక్ తరహా విజువల్‌తో మిక్స్ చేసిన ఈ పోస్టర్.. సినిమా కాన్సెప్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ధృవ్ పాత్ర క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకి సంగీతం: సంతోష్ నారాయణన్, డీఓపీ : వికీ, ఎడిటింగ్: జయసూర్య ఎస్, ప్రొడక్షన్ డిజైన్: జీఎం శేఖర్, యాక్షన్: విక్రమ్ మోర్.
కమర్షియల్‘జాకీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



