Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్  సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా నవతెలంగాణతో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం “Fertilizer Booking App” (ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్) ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మన కామారెడ్డి జిల్లాలో ఆదివారం నుండి ఈ ఆప్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు.

దీని ద్వారా రైతులు క్యూలైన్లలో నిలబడకుండా తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా యూరియాను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇకనుండి యూరియాని యాప్ ద్వారా నే బుక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. యాప్ లో బుక్ చేసుకోకుండా యూరియా ఇవ్వబడదని అని మండల రైతులకు తెలియజేస్తున్నామని సూచించారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి (Google Play Store ) నుండి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మరియు పట్టా వివరాలతో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా సమీప డీలర్ వద్ద ఎరువుల లభ్యతను పరిశీలించి ఆర్డర్ చేయవచ్చు అని పేర్కొన్నారు. 

ముఖ్య వివరాలు కీ వివరాలు (Key Details): యాప్ పేరు: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ( Fertilizer Booking App) తెలంగాణ వ్యవసాయ శాఖ. ప్రయోజనం: యూరియా కోసం క్యూలైన్లు తప్పవు, పారదర్శకమైన పంపిణీ ఉంటుందని అన్నారు.

బుకింగ్ ప్రక్రియ:
యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, మొబైల్ నంబర్ & ఓటిపి (OTP) ద్వారా లాగిన్ అవ్వాలి. జిల్లా, మండలం, పంట మరియు సాగు విస్తీర్ణాన్ని పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న విధంగా వేసిన పంటను (Pattadar Passbook) నమోదు చేయాలి. సమీపంలోని డీలర్ వద్ద స్టాక్ చెక్ చేసి, అవసరమైన యూరియా బస్తాలను బుక్ చేసుకోవాలి తెలిపారు.

ముఖ్యమైన విషయాలు:
బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోగా ఎరువులను కొనుగోలు చేయాలి. లేకపోతే బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. పట్టాదారులు, కౌలుదారులు కూడా ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. సమస్యలు ఎదురైతే వ్యవసాయ అధికారిని (MAO), వ్యవసాయ విస్తరణ అధికారులను (AEO) సంప్రదించాలి.  ఈ యాప్ తెలంగాణలోని రైతుల ఎరువుల కొరతను తగ్గించడానికి, సమయాన్ని ఆదా చేయడానికి దోహదపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -