నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భవిష్యత్తును ఆలోచించుకుని ఓట్లు వేయాలని ఓటర్లకు సూచించారు. దశాబ్దానికిపైగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. తెలంగాణకు ఏమైనా ప్రాజెక్టులు మంజూరు చేసిందా? అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని గతంలో స్వయంగా హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు మోడీని చూసి ఓటేయాలని అడుగుతున్నారని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ మనల్ని అవమానించారని ఆరోపించారు. రదల్లో నీటమునిగిన వస్తులన్నీ తిరిగిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ హామీ ఇచ్చారు. బండి మునిగితే బండి, ఆటో మునిగితే ఆటో ఇస్తామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి వస్తువులన్నీ తిరిగిస్తామని ప్రకటించారు. బండి సంయ్ హామీలను నమ్మి జీహెచ్ఎంసీలో 50 మంది బీజేపీ కార్పొరేటర్లను గెలిపిస్తే ఎన్నికలయ్యాక అడిగితే వస్తువులకు ఇన్సూరెన్స్ ఉంటుందని బండి సంజయ్ మాటమార్చారని విమర్శించారు. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేదానికి బండి సంజయ్ రికమండేషన్ ఎందుకో అని ప్రశ్నించారు.



