Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ 

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని సరం పేట గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలతో స్వయంగా ఆయన మాట్లాడి అంగన్వాడి కేంద్రంలో ప్రభుత్వం ద్వారా అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం మరియు న్యూట్రిషన్ ఫుడ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారులతో ముచ్చటించి,ప్రీస్కూల్ యాక్టివిటీస్ చేయించినారు.అనంతరం ప్రీస్కూల్ పిల్లల హాజరు శాతాన్ని పరిశీలించారు.

పోషణ ట్రాకర్ యాప్ లో ఎఫ్ ఆర్ ఎస్ చూసి అంగన్వాడి పని తీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వ అందిస్తున్న సదుపాయాలను గర్భిణీ స్త్రీలకు,చిన్న పిల్లల తల్లులకు,చిన్నారులకు క్రమ పద్ధతిలో అందే విధంగా చూడాలని అధికారులకు,సిబ్బందికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన అధికారులకు, సిబ్బందికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి,తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో జిసి మున్నయ్య, ఎంపీఓ రవికుమార్, సిడిపిఓ సక్కుబాయి, లావణ్య కుమారి, ఏసిడిపిఓ వెంకటమ్మ, సూపర్వైజర్  వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -