Monday, February 9, 2026
E-PAPER
Homeఖమ్మంబంగారు పతకాలు సాధించిన వ్యవసాయ కళాశాల విద్యార్థిని 

బంగారు పతకాలు సాధించిన వ్యవసాయ కళాశాల విద్యార్థిని 

- Advertisement -

– మెగా స్నాతకోత్సవంలో అభినందనల వెల్లువ
– హర్షం వ్యక్తం చేసిన స్థానిక కళాశాల ఏడీ హేమంత కుమార్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

స్థానిక వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధి చిన్నారి రెండు బంగారు పతకాలు సాధించింది. ఈ పతకాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో జరిగిన మెగా స్నాతకోత్సవంలో అందజేసారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని విశ్వవిద్యాలయం కేంద్ర కార్యాలయంలో సోమవారం మెగా స్నాతకోత్సవం నిర్వహించారు.

ఈ స్నాతకోత్సవంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల 2021 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని హాలావత్ చిన్నారి వ్యవసాయ విద్యలో భాగం అయిన కీటక శాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.అలాగే విశ్ప్రవవిద్యాలయం పరిధిలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అందరిలో అత్యధిక జీపీఏ సాధించింది. ఇందుకు గాను కీటక శాస్త్రంలో ప్రతిభాపాటవాలుకు డాక్టర్ సీహెచ్.కృష్ణమూర్తి రావు గోల్డ్ మెడల్, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్లో అత్యధిక జీపీఏ సాధించినందుకు డాక్టర్ బిఆర్. అంబెడ్కర్ గోల్డ్ మెడల్ ను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత కుమార్,బోధనా సిబ్బంది హర్షం వ్యక్తం చేసి చిన్నారి ని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -