నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ జిపి పరిధిలోని గ్రామంలో జిపి కార్యదర్శి లింగురామ్ ఆధ్వర్యంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద విజయ్ బాబు పాటిల్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఫీడర్ ఛానల్ ను ఏర్పాటు చేసేందుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డులు ఉన్న ప్రతి కూలీలందరికీ పనులు కల్పించే విధంగా పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు.
పని ప్రదేశంలో ప్రతి కూలి సమయం వృధా చేయకుండా పనులు నిర్వహించాలని నిర్వహించిన పనులకు కొలతల ప్రకారం డబ్బులు చెల్లించడం జరుగుతుందని పనిచేస్తున్న కూలీలకు సూచించారు. ఈ ఉపాధి హామీ పనుల పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ ,గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ , బాబు , జిపి కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు , కూలీలు , తదితరులు పాల్గొన్నారు.



