- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి తెరపడింది. నేటితో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. చివరి రోజుల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఈనెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
- Advertisement -



