నవతెలంగాణ – అశ్వారావుపేట
గత 10 రోజులు గా హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు సోమవారం బీ ఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రచారం నిర్వహించారు. 8 వ వార్డు లో వీధి వీధి కి,ఇంటింటి కి తిరిగి ఓటు అభ్యర్థించారు.ఈ క్రమంలో ఒక గృహిణి కుట్టు మిషన్ పై తాటి వెంకటేశ్వర్లు మిషన్ కుట్టి ఓటర్లు ను ఆకర్షించారు.ఒక వీధిలో పొయ్యిలో పుల్లలు వంటచెరకు నరికి గృహస్థులు ను ఆశ్చర్యానికి గురి చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతం కావాలన్నా, స్థానిక సమస్యలు పరిష్కారించాలన్నా బీఆర్ఎస్ ప్యానెల్ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో కాసాని చంద్ర మోహన్, పాలవలస జీవన్ రావు,మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.




